పొడిగింపును, అనువర్తనాన్ని మరియు వినియోగదారు స్క్రిప్ట్ ఇన్‌స్టాల్ సోర్స్‌లను కాన్ఫిగర్ చేయండి

పొడిగింపులు, అనువర్తనాలు మరియు థీమ్‌లను ఇన్‌స్టాల్ చేయడానికి ఏయే URLలు అనుమతించాలో పేర్కొనడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.

Google Chrome 21లో ప్రారంభమై, Chrome వెబ్ స్టోర్ బయటి నుండి పొడిగింపులు, అనువర్తనాలు మరియు వినియోగదారు స్క్రిప్ట్‌లను ఇన్‌స్టాల్ చేయడం మరింత క్లిష్టంగా అయ్యింది. మునుపు, వినియోగదారులు *.crx ఫైల్‌కి గల లింక్‌పై క్లిక్ చేసేవారు, అప్పుడు Google Chrome కొన్ని హెచ్చరికల తర్వాత ఫైల్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి అవకాశాన్ని అందిస్తుంది. Google Chrome 21 తర్వాత, అటువంటి ఫైల్‌లను తప్పనిసరిగా డౌన్‌లోడ్ చేసి Google Chrome సెట్టింగ్‌ల పేజీలోకి లాగాలి. ఈ సెట్టింగ్ నిర్దిష్ట URLలు పాత, సులభమైన ఇన్‌స్టాలేషన్ విధానాన్ని అవలంబించడానికి వాటిని అనుమతిస్తుంది.

ఈ జాబితాలోని ప్రతి అంశం పొడిగింపు శైలిని సరిపోలే నమూనా (https://developer.chrome.com/extensions/match_patternsని చూడండి). వినియోగదారులు ఈ జాబితాలోని అంశానికి సరిపోలే ఏ URL నుండి అయినా అంశాలను సులభంగా ఇన్‌స్టాల్ చేయగలరు. *.crx ఫైల్ మరియు డౌన్‌లోడ్ ప్రారంభమైన పేజీ రెండింటి స్థానాన్ని (అనగా. రిఫరర్) ఈ నమూనాలు తప్పనిసరిగా అనుమతించాలి.

ExtensionInstallBlacklist ఈ విధానం కంటే ముందే వర్తించబడుతుంది. అనగా, ఇది ఈ జాబితాలో ఉండే సైట్ నుండి చేసినా కూడా నిరోధక జాబితాలోని పొడిగింపు ఇన్‌స్టాల్ చేయబడదు.

Supported on: Microsoft Windows XP SP2 లేదా తర్వాత
దీని నుండి పొడిగింపును, అనువర్తనాన్ని మరియు వినియోగదారు స్క్రిప్ట్ ఇన్‌స్టాల్‌లను అనుమతించడానికి URL నమూనాలు

Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome\ExtensionInstallSources
Value Name{number}
Value TypeREG_SZ
Default Value

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)