URL ల జాబితాకు ప్రాప్తిని నిరోధించండి.

జాబితా చేసిన URLలకు ప్రాప్యతను బ్లాక్ చేస్తుంది.

ఈ విధానం నిరోధిత జాబితాలోని URLల నుండి వెబ్ పేజీలను లోడ్ చేయకుండా వినియోగదారును నిరోధిస్తుంది. నిరోధిత జాబితా ఏయే URLలను నిరోధిత జాబితాలో చేర్చాలో పేర్కొనే URL నమూనాల జాబితాను అందిస్తుంది.

ప్రతి URL నమూనా స్థానిక ఫైల్‌ల నమూనా రూపంలో లేదా సాధారణ URL నమూనా రూపంలో ఉండవచ్చు. స్థానిక ఫైల్ నమూనాలు 'file://path' ఆకృతిలో ఉంటాయి, పథం అనేది బ్లాక్ చేయాల్సిన ఖచ్చితమైన పథం అయి ఉండాలి. ఆదిప్రత్యయంలో ఆ పథం ఉన్న అన్ని ఫైల్ సిస్టమ్ స్థానాలు బ్లాక్ చేయబడతాయి.

సాధారణ URL నమూనా 'scheme://host:port/path' ఆకృతిలో ఉంటుంది.
అలా ఉన్నట్లయితే, పేర్కొన్న స్కీమ్ మాత్రమే బ్లాక్ చేయబడుతుంది. scheme:// ఆదిప్రత్యయం పేర్కొనకపోతే, అన్ని స్కీమ్‌లు బ్లాక్ చేయబడతాయి.
హోస్ట్ అవసరం, అది హోస్ట్ పేరు కావచ్చు లేదా IP చిరునామా కావచ్చు. హోస్ట్ పేరు యొక్క ఉప డొమైన్‌లు కూడా బ్లాక్ చేయబడతాయి. ఉప డొమైన్‌లను బ్లాక్ చేయకుండా నిరోధించడానికి, హోస్ట్ పేరు ముందు '.' చేర్చండి. ప్రత్యేక హోస్ట్ పేరు '*' అన్ని డొమైన్‌లను బ్లాక్ చేస్తుంది.
ఐచ్ఛిక పోర్ట్ 1 నుండి 65535 మధ్యలోని చెల్లుబాటు అయ్యే పోర్ట్ సంఖ్య. ఏదీ పేర్కొనకుంటే, అన్ని పోర్ట్‌లు బ్లాక్ చేయబడతాయి.
ఐచ్ఛిక పథం పేర్కొంటే, ఆ ఆదిప్రత్యయం కలిగి ఉన్న పథాలు మాత్రమే బ్లాక్ చేయబడతాయి.

మినహాయింపులను URL అనుమతి జాబితా విధానంలో నిర్వచించవచ్చు. ఈ విధానాలు 1000 నమోదులకు పరిమితం; తదుపరి నమోదులు విస్మరించబడతాయి.

అంతర్గత 'chrome://*' URLలను బ్లాక్ చేయడం సిఫార్సు చేయదగనిదని గుర్తుంచుకోండి, దీని వలన ఊహించని లోపాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఈ విధానాన్ని సెట్ చేయకుంటే, బ్రౌజర్‌లో URL ఏదీ నిరోధిత జాబితాలో ఉంచబడదు.

Supported on: Microsoft Windows XP SP2 లేదా తర్వాత
URL ల జాబితాకు ప్రాప్తిని నిరోధించండి.

Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome\URLBlacklist
Value Name{number}
Value TypeREG_SZ
Default Value

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)